పండుగ పూట విషాదం
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:28 AM
ముక్కనుమ పూట ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలో శనివారం వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు.
- వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి
ముక్కనుమ పూట ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలో శనివారం వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో లారీ ఢీకొని నెల్లిమర్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, పూసపాటిరేగలో వ్యాన్ ఢీకొని బాలుడు, లక్కవరపుకోటలో కోనేరులో మునిగి యువకుడు, ఇదే మండలంలో చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు, గుమ్మలక్ష్మీపురంలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందారు.
లారీ ఢీకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
నెల్లిమర్ల/రణస్థలం, జనవరి 17 (ఆం ధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని జేఆర్‌పురం పోలీస్ సర్కిల్ కార్యాలయం సమీపంలో జాతీ య రహదారిపై శనివారం ఉదయం జరి గిన ప్రమాదంలో నెల్లిమర్ల మండలం తమ్మాపురానికి చెందిన దువ్వు కోటేశ్వర రావు (26)అనే సాఫ్ట్‌వేరు ఉద్యోగి మృతి చెందాడు. జేఆర్‌పురం పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కోటేశ్వరరావు హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి కోసం స్వగ్రామం వచ్చాడు. శుక్రవారం తన తల్లి, సోదరుడితో తాతగారి గ్రామం వల్లభరావుపేట వచ్చాడు. తల్లికి సుగర్ పరీక్షలు చేయించే నిమిత్తం శనివారం రణస్థలం మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకొచ్చాడు. అనంతరం తిరిగి వల్లభరావుపేట వెళ్తుండగా సీఐ కార్యాలయ సమీపంలో వెనుక నుంచి లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోటేశ్వరరావు మృతితో తమ్మాపురంలో విషాదచాయలు అలముకున్నాయి.
వ్యాన్ ఢీకొని బాలుడు..
పూసపాటిరేగ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో పేరాపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో విశాఖలో నివాసం ఉంటున్న సిరా ఖనీష్(6) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖలోని అచ్యుతాపురం ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్న సిరా కిరణ్‌కుమార్ అనే వ్యక్తి తమ సొంతగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని అదపాకకు రెండు రోజుల కిందట వెళ్లాడు. శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై తిరిగి విశాఖకు కిరణ్‌కుమార్, తన బావమరిది లోకేష్, పెద్ద కుమారుడు ఖనీష్‌తో వస్తుండగా పేరాపురం వద్ద వెనుక నుంచి వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ఖనీష్ అక్కడిక్కడే మృతి చెందగా లోకేష్, కిరణ్‌కుమార్‌కు బలమైన గాయాలయ్యాయి. వీరిని వెంటనే 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. లోకేష్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈతకు వెళ్లి యువకుడు..
లక్కవరపుకోట, జనవరి 17(ఆంధ్రజ్యోతి): లచ్చంపేట గ్రామంలో శనివారం శివాలయం ఎదురుగా ఉన్న కోనేరులో ఈతకు వెళ్లి యువకుడు మృతిచెందినట్లు ఎస్‌ఐ నవీన్‌పడాల్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలం రాజీపేటకు చెందిన సంపంగి సాయి (19) లచ్చంపేటలోని తన తాతగారు సమ్మంగి సోములు ఇంటికి పండుగకు వచ్చాడు. స్నేహితుడితో కలిసి శనివారం శివాలయం ఎదురుగా ఉన్న కోనేరులో ఈతకు దిగాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునగిపోయి మృతిచెందా డు. మృతుని కుటుంబం ఉపాధి నిమిత్తం ప్రస్తుతం విశాఖప ట్నం కూర్మన్నపాలెం రాజీవ్‌నగర్‌లో ఉంటుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు..
లక్కవరపుకోట మండలం రేగ పంచాయతీ నీలకంఠాపురం గ్రామానికి చెందిన కుప్ప మరిడయ్య (64) అనే గీత కార్మికుడు శనివారం సాయంత్రం తాటి చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందాడు. కల్లుగీతకు మరిడయ్య తాటిచెట్టు ఎక్కు తుండగా అదుపుతప్పి పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన ఆయ న్ను లంకవానిపాలెం పీహెచ్‌సీకి తరలిం చగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భార్య లక్ష్మి తెలిపింది. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
చికిత్సపొందుతూ కానిస్టేబుల్..
గుమ్మలక్ష్మీపురం, జనవరి 17 (ఆంధ్ర జ్యోతి): చికిత్సపొందుతూ ఓ కానిస్టేబుల్ శనివారం మృతిచెందాడు. ఎస్‌ఐ షణ్ముఖ రావు కథనం మేరకు.. గుమ్మలక్ష్మీపురం మండలంలోని కితలంబ గ్రామానికి చెందిన పువ్వల రవి (37) వీరఘట్టం పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా రు. ఈనెల 14న బీట్ కోసం వీరఘట్టం నుంచి అచ్చెపువలస వెళ్తుం డగా బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు. ఈ మేరకు విశాఖలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు.