ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Jul 26 , 2026 | 01:11 AM
డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పాలకొండ డిపో మేనేజర్ బీఎస్‌ఎన్ మూర్తి సూచించారు.
పాలకొండ డిపో మేనేజర్ బీఎస్‌ఎన్ మూర్తి
పాలకొండ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పాలకొండ డిపో మేనేజర్ బీఎస్‌ఎన్ మూర్తి సూచించారు. శనివారం పాలకొండ ఆర్టీసీ డిపోలో ప్రమాద రహిత వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్లక్ష్య డ్రైవింగ్, సెల్‌ఫోన్ వినియోగం నివారించాలని, రద్దీ ప్రాంతాలు, పాఠశాలల వద్ద అప్రమ త్తంగా వాహనాలు నడపాలని సూచించారు. అనంతరం ఉద్యోగులతో ప్రమాద రహిత ప్రయాణంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ యు.రమేష్, ఏఎంఈ ఎల్ రాము, సెక్యూరిటీ హెడ్‌గార్డ్ ఎం.గోవిందరావు, బీకేమూర్తి, ఎల్‌హెచ్ టి. శ్రీనివాసరావు, యూనియన్ నాయకులు డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.