Traditional Quack Treatments నాటు వైద్యం ప్రాణాంతకం
ABN , Publish Date - May 16 , 2026 | 11:54 PM
Traditional Quack Treatments Can Be Fatal నాటు వైద్యం ప్రాణాంతకమని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. శాస్ర్తీయ ఆధారాలు లేని నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకోవదని సూచించారు. ‘ నాటు వైద్యానికో నమస్కారం, లార్వావేట’ కార్యక్రమాలపై గొరడ గ్రామంలో శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు.
గుమ్మలక్ష్మీపురం, మే16(ఆంధ్రజ్యోతి): నాటు వైద్యం ప్రాణాంతకమని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. శాస్ర్తీయ ఆధారాలు లేని నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకోవదని సూచించారు. ‘ నాటు వైద్యానికో నమస్కారం, లార్వావేట’ కార్యక్రమాలపై గొరడ గ్రామంలో శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్‌ఎంలను సంప్రదించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం, వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా నాటువైద్యానికో నమస్కారంపై ప్రదర్శించిన లఘునాటిక విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత డీఎంహెచ్‌వో రేగిడి పీహెచ్‌సీలో రేగిడి, దుడ్డుఖల్లు ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో సమీక్షించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్‌సీడీ అధికారి టి.జగన్మోహన్‌రావు, ప్రోగ్రాం ఆఫీసర్ సూర్యకౌశిక్, డీఎంవో సూర్యనారాయణ, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.