Traditional Quack నాటు వైద్యం ఆరోగ్యానికి చేటు
ABN , Publish Date - May 11 , 2026 | 11:54 PM
Traditional Quack Remedies Are Harmful to Health” నాటు వైద్యం ఆరోగ్యానికి చేటని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. మూఢ నమ్మకాలతో ఎవరూ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సూచించారు. ‘నాటు వైద్యానికో నమస్కారం’ పేరిట సోమవారం గరుగుబిల్లి పీహెచ్‌సీ ప్రాంగణంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గరుగుబిల్లి, మే11(ఆంధ్రజ్యోతి): నాటు వైద్యం ఆరోగ్యానికి చేటని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. మూఢ నమ్మకాలతో ఎవరూ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సూచించారు. ‘నాటు వైద్యానికో నమస్కారం’ పేరిట సోమవారం గరుగుబిల్లి పీహెచ్‌సీ ప్రాంగణంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు గ్రామీణులు నాటు వైద్యం, పసరు మందులు వంటి జోలికి వెళ్లరాదని డీఎంహెచ్‌వో తెలిపారు. గ్రామస్థాయి ఆశ, ఏఎన్‌ఎం, వైద్య సిబ్బందిని సంప్రదించి సమీపంలోని ఆసుపత్రిలో వైద్యసేవలు పొందాలని సూచించారు. నాటు వైద్యం, పసరు మందులతో శరీర అవయవాలు ఇన్ఫెక్షన్‌కు గురవుతాయన్నారు. వైద్యాధికారులు, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి నాటు వైద్యం, మూఢ నమ్మకాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజల అనారోగ్య లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి తగు చికిత్స అందిం చాలని, అవసరమైన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోదక టీకాల అధికారి వై.విజయ్‌మోహన్, ఎన్‌సీడీ , ఆర్‌బీఎస్‌కే అధికారి టి.జగన్మోహనరావు, ప్రోగ్రాం ఆఫీసర్ సూర్యకౌశిక్ తదితరులు పాల్గొన్నారు.