ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:13 AM
ఎస్.కోట పట్టణంలోని జగన్నాథ చెరువు పొలాల్లో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కోట రూరల్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఎస్.కోట పట్టణంలోని జగన్నాథ చెరువు పొలాల్లో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎస్‌ఐ నవీన్‌పడాల్ శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జామి మండలం పావాడ గ్రామానికి చెందిన అల్లు వెంకటరావు (56) ఎస్.కోట పట్టణానికి చెందిన పట్నాల సన్యాసిరావు అనే వ్యక్తి వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే గురు వారం సాయంత్రం వెంకటరావు ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా ప్రమాదవ శాత్తు ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో వెంకటరావు అక్కడికక్కడే మృతిచెం దాడు. మృతుడి అల్లుడు శివరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.