Share News

ట్రాక్టర్‌ బోల్తా.. బాలుడి మృతి

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:15 AM

ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో ఓ బాలుడు మృతిచెందాడు.

ట్రాక్టర్‌ బోల్తా.. బాలుడి మృతి

మెరకముడిదాం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మెరకముడిదాం మండలంలోని పులిగుమ్మి గ్రామంలో శని వారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పులిగు మ్మి గ్రామానికి చెందిన బెజవాడ కృష్ణ శనివారం తనకున్న పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నుతున్నాడు. ట్రాక్టర్‌పైన అతని పక్కనే తన కుమారుడు జస్వంత్‌(13) కూర్చున్నాడు. పొలం గట్టు ఎక్కే సమయంలో ట్రాక్టర్‌ ఇంజన్‌ బోల్తాపడింది. దీంతో జస్వంత్‌ ప్రమాదవశాత్తు ఇంజన్‌ కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న బుదరాయవలస పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాని కి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. జస్వంత్‌ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

Updated Date - Jun 14 , 2026 | 12:15 AM