Share News

గిరిజన గ్రామాల్లో పర్యటన

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:15 AM

గోపాలరాయుడిపేట పంచాయతీకి చేరువలోని ఐదు గిరిజన గ్రామాలను బుధవారం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు పర్యటించారు

గిరిజన గ్రామాల్లో పర్యటన
సమస్యలు తెలుసుకుంటున్న ఐటీడీఏ అధికారి

బొబ్బిలి రూరల్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గోపాలరాయుడిపేట పంచాయతీకి చేరువలోని ఐదు గిరిజన గ్రామాలను బుధవారం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృపావలస గ్రామపెద్ద సీహెచ్‌.సీతయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మేము ఇక్కడే నివాసం ఉంటున్నామని, మా గ్రామాలను గోపాల రాయుడిపేట పం చాయతీలో విలీనం చేయాలని, సంక్షేమ పథకాలు అమ లు చేయాలని కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, మంత్రి సంధ్యారాణి, ఎస్టీ కమిషనర్‌ స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుందని ఇంత వరకూ ఎవరూ మా సమస్యలను పరిష్కరించలేదని గిరిజన సంక్షేమ అధి కారి తెలిపారు. సమస్యలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని అధికారి కోర డంతో వారు వినతిపత్రం అందజేశారు. ఆక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:16 AM