tortoise Into the sea సముద్రంలోకి వడివడిగా..
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:46 AM
tortoise Into the sea తీరం నుంచి పిల్ల తాబేళ్లు సముద్రం బాట పడుతున్నాయి. హేచరీల్లో కొద్దిరోజులు పెరిగాక నీటిలోకి పరుగులు తీస్తున్నాయి. అటవీశాఖ సిబ్బంది చొరవతో విడతల వారీగా సంద్రంలోకి వెళ్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 1800 పిల్లలను పంపారు. దాదాపు 50వేల పిల్లలను సముద్రంలోకి విడుదల చేస్తామని వారు చెబుతున్నారు.
సముద్రంలోకి వడివడిగా..
పరుగులు తీస్తున్న పిల్ల తాబేళ్లు
విడతల వారీగా వదులుతున్న అటవీ సిబ్బంది
నేటి వరకు 1800 పిల్లలు విడుదల
50వేల పిల్లలు వదలుతామంటున్న అధికారులు
భోగాపురం, మార్చి30(ఆంధ్రజ్యోతి):
తీరం నుంచి పిల్ల తాబేళ్లు సముద్రం బాట పడుతున్నాయి. హేచరీల్లో కొద్దిరోజులు పెరిగాక నీటిలోకి పరుగులు తీస్తున్నాయి. అటవీశాఖ సిబ్బంది చొరవతో విడతల వారీగా సంద్రంలోకి వెళ్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 1800 పిల్లలను పంపారు. దాదాపు 50వేల పిల్లలను సముద్రంలోకి విడుదల చేస్తామని వారు చెబుతున్నారు.
జిల్లా తీరం వెంబడి సముద్రం నుంచి ప్రతీ ఏడాది డిసెంబరు, జనవరి, మార్చి, ఏప్రిల్ వరకు సముద్రతాబేళ్లు(ఆలివ్‌రెడ్లీ) తీరానికి వచ్చి తీరంలో ఇసుకను తవ్వి గుడ్లు పెట్టి వెళ్లి పోతుంటాయి. ఈగుడ్లను ఫారెస్టు అధికారులు సేకరించి హేచరీస్ ఏర్పాటు చేసి అందులో గుడ్లు పొదిగించే చర్యలు చేపడతారు. ప్రతీ ఏడాది సమారు 500 వరకు తాబేళ్లు తీరానికి వచ్చి సుమారు 53వేల వరకు గుడ్లు పెడతాయని అంచనా. ముక్కాం, చోడిపల్లి పేట, చేపలకంచేరు, పూసపాటిరేగ మండలం చింతపల్లి, పులిగెడ్డ, బర్రిపేట, తిప్పలవలస, బొడ్డుగురయ్యపేట పరిధిలో తీరంలో హేచరీలు ఏర్పాటు చేసి గుడ్లును 45 రోజులు పాటు అటవీ సిబ్బంది సంరక్షిస్తారు. అనంతరం పిల్లలు వచ్చాక వాటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు.
ఫ సముద్ర తాబేళ్లు (ఆలివ్ రిడ్లీ) సముద్ర పర్యావరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి సముద్ర గర్భంలో నాచు, జల్లీఫిష్‌లను తింటూ సముద్ర అడుగు భాగాన్ని శుభ్రంగా ఉంచుతాయి.
ఫ జిల్లా తీరం ప్రాంతం పరిధిలో ఇప్పటి వరకు సుమారు 51వేల గుడ్లు సేకరించారు. 1800 వరకు తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచి పెట్టారు. ఇంకా సుమారు 49200 వరకు గుడ్లు హేచరీల్లో ఉన్నాయి. మే నెల వరకు వీటిని సంరక్షిస్తూ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదులు తున్నారు.