Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేయాలి

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:52 PM

సామాన్య ప్రజల నుంచి వస్తున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూసినప్పుడే ప్రభుత్వం పట్ల అధికార యంత్రాంగం పట్ల సామాన్యుల్లో నమ్మకం పెరుగుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేయాలి

  • మంత్రి కొండపల్లి

విజయనగరం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): సామాన్య ప్రజల నుంచి వస్తున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూసినప్పుడే ప్రభుత్వం పట్ల అధికార యంత్రాంగం పట్ల సామాన్యుల్లో నమ్మకం పెరుగుతుందని మానవ తా దృక్పథంతో పరిష్కారం చేయాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం విజయనగరం లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజాదర్బా ర్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారు లు అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రజల నుంచి 34 అర్జీలు వచ్చాయి. పింఛన్లు, శ్మశానవాటికలు అభి వృద్ధి, రోడ్లు, ఉపాధి అవకాశాలపై అర్జీలు సమర్పించా రు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ ఎప్పటికప్పుడు కార్యాలయ సిబ్బంది సంబంధిత అధికా రుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన ఆదేశించారు.

Updated Date - Jan 04 , 2026 | 11:52 PM