Education Development విద్యారంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Jul 24 , 2026 | 10:44 PM
Top Priority for Education Development విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధా న్యం ఇస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం సాలూరు మండలం మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించి మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌కు ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు.
సాలూరు, జూలై24(ఆంధ్రజ్యోతి): విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధా న్యం ఇస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం సాలూరు మండలం మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించి మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌కు ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలంతా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రధానంగా ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా.. అందరికీ తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలో సుమారు లక్ష మంది విద్యార్థులకు సంబంఽధించి 81వేల తల్లుల ఖాతాల్లో రూ.172.50 కోట్లు జమచేసినట్టు తెలిపారు. అనంతరం పాఠశాల వాతావరణాన్ని పరిశీలించిన మంత్రి విద్యార్థులతో కలిసి మఽధ్యాహ్న భోజనం చేశారు. భోజన నాణ్యత, పరిశుభ్రత, పాఠశాలలో సౌకర్యాలపై ఆరా తీశారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి సారించాలన్నారు. మొబైల్ ఫోను వినియోగిస్తే.. వారు ఏమి చూస్తున్నారో ఎప్పటికప్పుడు గమనిం చాలని సూచించారు. ప్రతీ విద్యార్థి పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పరమేష్, అన్నపూర్ణమ్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.