Share News

Tribal Areas గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:11 AM

Top Priority for Development of Tribal Areas గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సంద ర్భంగా బుధవారం తన ప్రసంగంలో ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.

  Tribal Areas గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట

పార్వతీపురం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సంద ర్భంగా బుధవారం తన ప్రసంగంలో ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై పూర్తిస్తాయిలో వివరించారు. గిరిజన ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం, విద్య అందించంతోపాటు వారి జీవన స్థితిగతుల్లో మార్పును తీసుకొచ్చేందుకు సర్కారు ఎన్నో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను కూడా గవర్నర్‌ వివరించారు. కాగా అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, బోనెల విజయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:11 AM