Share News

Travel చొరవ చూపారు.. దారి కష్టాలు తీర్చారు

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:48 PM

Took the Initiative, Eased Travel Woes ఉదయపురం పంచాయతీ పరిధిలో కంఠుగూడ-తాటిశీల గ్రామస్థులకు దారి కష్టాలు తప్పాయి. పోలీసులు, స్థాని యువతతో కలిసి కర్రల వంతెన ఏర్పాటు చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  Travel   చొరవ చూపారు.. దారి కష్టాలు తీర్చారు
గెడ్డపై ఏర్పాటుచేసిన కర్రల వంతెన

  • కంఠుగూడ-తాటిశీల గ్రామస్థులకు తప్పిన ఇక్కట్లు

కురుపాం రూరల్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉదయపురం పంచాయతీ పరిధిలో కంఠుగూడ-తాటిశీల గ్రామస్థులకు దారి కష్టాలు తప్పాయి. పోలీసులు, స్థాని యువతతో కలిసి కర్రల వంతెన ఏర్పాటు చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా కంఠుగూడకు చెందిన విద్యార్థులు, గ్రామస్థులు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని తాటిశీలకు చేరుకోవాలంటే మధ్యలో గెడ్డ దాటాల్సి వచ్చేది. ప్రధానంగా 20 మంది విద్యార్థులు తాటిశీల పాఠశాలకు వెళ్లేందుకు పడే కష్టాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించింది. చిన్నారులకు మేలు జరిగేలా చూడాలని ఆదేశించింది. దీంతో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఎల్విన్‌పేట సీఐ బి.హరి, నీలకంఠాపురం ఎస్‌ఐ రమేష్‌ నాయుడు స్థానిక యువత సహకారంతో కంఠుగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న గెడ్డపై తాటిచెట్లు, కర్రలతో 30 మీటర్ల పొడవున తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయించారు. బుధవారం వారు ఆ వంతెనను ప్రారంభించారు. మొత్తంగా గ్రామస్థులు, విద్యార్థుల రాకపోకల సమస్యను పరిష్కరించారు.

Updated Date - Sep 30 , 2026 | 11:48 PM