Tomatoes పొలాల్లోనే టమాటా
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:23 PM
Tomatoes Left in the Fields టామాటా రైతులకు కన్నీరే మిగిలింది. ధర లేకపోవడంతో పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. వీరఘట్టంలో సుమారు 30 ఎకరాల్లో రైతులు టమాటా సాగు చేపట్టారు. అయితే దిగుబడి బాగున్నా.. ప్రస్తుతం 23 కేజీల ట్రే ధర రూ.50 పలుకుతుం డడంతో రైతులు నష్టానికి గురవుతున్నారు.
వీరఘట్టం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): టామాటా రైతులకు కన్నీరే మిగిలింది. ధర లేకపోవడంతో పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. వీరఘట్టంలో సుమారు 30 ఎకరాల్లో రైతులు టమాటా సాగు చేపట్టారు. అయితే దిగుబడి బాగున్నా.. ప్రస్తుతం 23 కేజీల ట్రే ధర రూ.50 పలుకుతుం డడంతో రైతులు నష్టానికి గురవుతున్నారు. పంటను ఏరి పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం తదితర మార్కెట్లకు తరలించడానికి ఒక ట్రేకు రూ.20 నుంచి రూ.25 ఖర్చు అవుతుంది. అయితే మార్కెట్‌లో ఒక ట్రేకు రూ. 50 మాత్రమే వస్తుండడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పంట నారు వేసి ఎరువులు, పురుగు మందులు తదితర వాటికి వేల రూపాయలు ఖర్చు చేశామని.. ప్రస్తుతం పెట్టుబడి సొమ్ము కూడా రావడం లేదని వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని రైతులు కోరుతన్నారు.