Share News

Rythu Bazaars రైతుబజార్లలో టమాటాను విక్రయించొచ్చు

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:38 PM

Tomatoes Can Be Sold in Rythu Bazaars రైతులు తమ సమీపంలోని రైతు బజార్లలో టమాటాను విక్రయించి లాభసాటి ధర పొందాలని జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్‌ శాఖ అధికారి డీఆర్‌ఆర్‌ ఏసురాజు తెలిపారు. ఈ నెల 4న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘కష్టం వృథా...తీరని వ్యధ’ అనే కథనంపై ఆయన స్పందించారు.

  Rythu Bazaars రైతుబజార్లలో టమాటాను విక్రయించొచ్చు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

సాలూరు, మార్చి6(ఆంధ్రజ్యోతి): రైతులు తమ సమీపంలోని రైతు బజార్లలో టమాటాను విక్రయించి లాభసాటి ధర పొందాలని జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్‌ శాఖ అధికారి డీఆర్‌ఆర్‌ ఏసురాజు తెలిపారు. ఈ నెల 4న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘కష్టం వృథా...తీరని వ్యధ’ అనే కథనంపై ఆయన స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సాలూరు నియోజకవర్గం పరిధిలో సుమారు 250 ఎకరాల్లో టమాటా సాగవుతోందని, అయితే ఈ ఏడాది భారీగా దిగుబడులు పెరిగాయని తెలిపారు. ఒకేసారి మార్కెట్‌కు అవి రావడం వల్ల ధర పడిపోయిందన్నారు. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.6 నుంచి రూ.8 మధ్య ఉందని చెప్పారు. రైతులు తమ పంటను తుక్కవ ధరకే దళారులకు విక్రయించొద్దని సూచించారు. నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేలా రైతు బజార్లలో తగిన స్థలాలు, సౌకర్యాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Updated Date - Mar 06 , 2026 | 11:38 PM