నేడు పోలమాంబ ఏడోవారం జాతర
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:00 AM
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ ఏడో వారం జాతరను మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఆలయం ఈవో బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.
మక్కువ రూరల్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ ఏడో వారం జాతరను మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఆలయం ఈవో బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. చదురు గుడి, వనం గుడి వద్ద భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తుకు తాగునీటి సౌకర్యం కల్పించనున్నా మన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణ తెలిపారు. ఏడో వారం జాతరకు అదనంగా బస్సులను నడప నున్నామని సాలూరు ఆర్టీసీ డీఎం పి.ఆచారి తెలిపారు.