’ Muthyala Muggula Competitions నేడు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ముత్యాల ముగ్గుల పోటీలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:06 AM
Today: ‘Andhra Jyothi–ABN’ Muthyala Muggula Competitions ముగ్గుల పోటీలకు సర్వం సిద్ధమైంది. జిల్లాకేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్’ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. (పవర్డ్ బై : సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్ వాసి అగరబత్తీ) శనివారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరగనున్నాయి.
పార్వతీపురం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ముగ్గుల పోటీలకు సర్వం సిద్ధమైంది. జిల్లాకేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్’ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. (పవర్డ్ బై : సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్ వాసి అగరబత్తీ) శనివారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పోటీలు జరుగుతాయి. అనంతరం న్యాయ నిర్ణేతలు ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారు. ఆకర్షణీయమైన మూడు ముగ్గులను ఎంపిక చేసి విజేతలకు బహుమతులతోపాటు నగదు పురస్కారాన్ని అందజేస్తారు. ప్రథమ విజేతకు రూ.6వేలు, ద్వితీయ విజేతకు రూ.4 వేలు, తృతీయ విజేతకు రూ.3వేలు నగదుతోపాటు మెమొంటోలను అందజేస్తారు. ఇందులో పాల్గొన్న వారికి కన్సొలేషన్ బహుమతులు కూడా ఉంటాయి. ఈ పోటీలకు స్థానిక స్పాన్సర్‌గా శ్రీవెంకటేశ్వర జ్యూయల్ ప్యాలస్ యాజమాన్యం సహాయ సహకారాలు అందిస్తోంది.
ఇవీ నిబంధనలు..
ముగ్గుల పోటీల్లో పాల్గొనే మహిళలు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఉదయం 9 గంటలకు క్రీడా మైదానానికి చేరుకుని పేర్లు నమోదు చేసుకోవాలి. కేవలం చుక్కల ముగ్గులను మాత్రమే వేయాలి. ముగ్గును ఒకరు మాత్రమే వేయాలి. ఇందుకు గరిష్ట సమయం రెండు గంటలు మాత్రమే. ముగ్గు వద్దకు న్యాయనిర్ణేతలు వచ్చేటప్పుడు ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలో చెప్పగలిగి ఉండాలి. ముగ్గు చేతితోనే వేయాలి. వాటికి అవసరమై రంగులు తెచ్చుకోవాలి. గొట్టాలు, బద్దలు వంటివి ఉపయోగిం చకూడదు. జల్లెడ ఉపయోగించుకోవచ్చు. ముగ్గుల్లో గొబ్బెమ్మలు, బతుకమ్మలను అమర్చుకోవచ్చు.. కానీ ఇతరత్రా వస్తువులను అదనపు ఆకర్షణ కోసం వాడకూడదు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి విజేత ఈనెల 10న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. అక్కడకు వెళ్లేందుకు విజేతతో పాటు మరొకరికి ప్రయాణ, వసతి ఖర్చులు ఆంధ్రజ్యోతి- ఏబీన్ భరిస్తుంది.