Today, ‘Aksharam’ నేడు అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:50 PM
Today, ‘Aksharam’ as Support… Solutions as the Agenda సాలూరులో శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వ ర్యంలో నిర్వహించనున్న ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17వ వార్డులో సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉదయం 10 గంటలకు వెలమపేటలోని సీతారామ కల్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహణకు నిర్వహణకు సర్వం సిద్ధమైంది.
పార్వతీపురం/సాలూరు,మార్చి13(ఆంధ్రజ్యోతి): సాలూరులో శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వ ర్యంలో నిర్వహించనున్న ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17వ వార్డులో సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉదయం 10 గంటలకు వెలమపేటలోని సీతారామ కల్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహణకు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, సబ్ కలెక్టర్ వైశాలి, మునిసిపల్ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులు హాజరుకానున్నారు. వార్డు ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. లోఓల్టేజ్ , మురుగు కాలువలు, సీసీ రహదారులు, శ్మశాన వాటిక ప్రాంతంలో మౌలిక వసతుల సమస్యను వారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు.