To the funeral, in waist-deep water... నడుంలోతులో అంత్యక్రియలకు..
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:17 AM
To the funeral, in waist-deep water... మున్సిపాలిటీ పరిధిలోని బుచ్చింపేట గ్రామంలో అంత్యక్రియలకూ అవస్థలు పడాల్సి వచ్చింది. వరదలో నడులోతులో దిగి మృతదేహాన్ని శ్మశానికి తరలించాల్సిన దుస్థితి ఎదురైంది. గ్రామానికి చెందిన పిట్టా సూరి(60) అనారోగ్యంతో గురు వారం మృతిచెందాడు.
నడుంలోతులో అంత్యక్రియలకు..
వరద నీటిలోనే మృతదేహాన్ని తీసుకెళ్లిన
బుచ్చంపేట గ్రామస్థులు
రాజాం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలోని బుచ్చింపేట గ్రామంలో అంత్యక్రియలకూ అవస్థలు పడాల్సి వచ్చింది. వరదలో నడులోతులో దిగి మృతదేహాన్ని శ్మశానికి తరలించాల్సిన దుస్థితి ఎదురైంది. గ్రామానికి చెందిన పిట్టా సూరి(60) అనారోగ్యంతో గురు వారం మృతిచెందాడు. అతని భౌతిక దేహానికి అంత్యక్రియలు నిర్వహించే ందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శ్మశానానికి బయలుదేరారు. ఎప్పటిలాగే ఈరా చెరువు గెడ్డ లోనుంచి వెళ్లాలి. గెడ్డ పొంగిపొర్లుతున్నా వేరే దారి లేక నానా అవస్థలు పడుతూ మృతదేహాన్ని తరలించారు. నడుంలోతులో దిగి తీసుకెళ్లారు. ఈ గెడ్డపై వంతెన నిర్మించాలని చాలా సంవత్సరాలుగా కోరుతున్నామని గ్రామానికి చెందిన పిట్టా జగదీష్, పిట్టా పైడిరాజు, కోరాడ శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు.