Share News

ఎటువంటి ఆపదలు రాకుండా రక్షించాలని..

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:30 AM

మండలంలోని కొట్టాం గ్రామదేవత కోటమ్మతల్లికి ఆ గ్రామ ఉపాధి హామీ వేతనదారులు బుధవారం మొక్కలు చెల్లించుకున్నారు.

ఎటువంటి ఆపదలు రాకుండా రక్షించాలని..

  • కోటమ్మతల్లికి ఉపాధి వేతనదారుల మొక్కలు

ఎస్‌.కోట రూరల్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొట్టాం గ్రామదేవత కోటమ్మతల్లికి ఆ గ్రామ ఉపాధి హామీ వేతనదారులు బుధవారం మొక్కలు చెల్లించుకున్నారు. ప్రతిఏటా ఉపాధి పనులు ప్రారంభ సమయంలో ఆ గ్రామస్థులు కోటమ్మతల్లి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకోవడం ఆనవా యితీ. తాము పనిచేసే మూడునెలల కాలంలో తమకు ఎటువంటి ఆపదలు లేకుండా రక్షించాలని కోరుకుంటా మని చెప్పారు. ఇందులో భాగంగా అమ్మవారి పూజారి తో కలిసి గ్రామం నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:30 AM