‘స్నేహభావాన్ని పెంపొందించేందుకే..’
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:37 AM
పోలీసులు, ప్రజల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నామని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు.
సీతానగరం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పోలీసులు, ప్రజల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నామని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా సోమవారం సీతానగరం పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేలా ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. పోలీసుల సేవలు, భద్రతా చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిం చేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో వాహన తనిఖీలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పోలీస్‌శాఖ నిరంతరం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ రంగనాథం, ఎస్‌ఐ హేమలతతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.