దివ్యాంగుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు..
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:56 PM
దివ్యాంగుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు డిసెంబరు 1, 2 తేదీలలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి పారా క్రీడాపోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి(డీఎస్‌డీవో) ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు.
1, 2 తేదీలలో జిల్లా స్థాయి పారా క్రీడా పోటీల నిర్వహణ
డీఎస్‌డీవో వెంకటేశ్వరరావు
విజయనగరం టౌన్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు డిసెంబరు 1, 2 తేదీలలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి పారా క్రీడాపోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి(డీఎస్‌డీవో) ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం విజ యనగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 26 జిల్లాల నుంచి సుమారు 2వేల మంది దివ్యాంగ క్రీడాకారులతో ఈ పోటీలను నిర్వహిస్తామని చెప్పారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తు న్నామని తెలిపారు. పారా బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్, పారా అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఈ పోటీలలో విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం స్థానిక డీఎస్‌డీవో కార్యాలయాన్ని సంప్రదిం చాలని ఆయన సూచించారు.