future of students! విద్యార్థుల భవితకు ఊతమిచ్చేలా!
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:13 AM
To boost the future of students! జిల్లాలో అక్షరాస్యత పెంపుతో పాటు విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేసేలా జిల్లా అధికార యంత్రాంగం వినూత్న చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా గిరిజన యువత టెన్త్, ఇంటర్ వరకే ఆగిపోకూడదనే ఉద్దేశంతో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మన్యం ఆణిముత్యం పేరిట కెరీర్ ఫెస్ట్ రథాలు అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
టెన్త్, ఇంటర్ తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై అవగాహన
వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన
పార్వతీపురం, మార్చి29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అక్షరాస్యత పెంపుతో పాటు విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేసేలా జిల్లా అధికార యంత్రాంగం వినూత్న చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా గిరిజన యువత టెన్త్, ఇంటర్ వరకే ఆగిపోకూడదనే ఉద్దేశంతో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మన్యం ఆణిముత్యం పేరిట కెరీర్ ఫెస్ట్ రథాలు అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కెరియర్, హెల్త్ కౌన్సిలర్లతో ఓ బృందాన్ని నియమించారు. కాగా ఈ నెల ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. టెన్త్, ఇంటర్ పూర్తయిన తర్వాత విద్యార్థులు ఏ మార్గంలో వెళ్లాలనే దానిపై ఆ బృందం అవగాహన కల్పిస్తుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల పరిధిలో ఈ రథాలు విస్తృతంగా పర్యటిస్తున్నాయి. ప్రతి పాఠశాల, సంక్షేమ హాస్టళ్లకు చేరుకుని కౌన్సిలర్లు చేరుకుని విద్యార్థుల భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేస్తున్నారు. పదో తరగతి తర్వాత పాలిటెక్నికల్, ఐటీఐ, ఇంటర్, వృత్తి విద్యా వంటి కోర్సులు చదవొచ్చని, వాటి ద్వారా ఉద్యోగావకాశాలు పొందొచ్చని కౌన్సిలర్లు సూచిస్తున్నారు. అదేవిధంగా స్థానిక వనరులను వినియోగించుకుని ఉపాఽధి ఎలా సాధించుకోవాలో వివరిస్తున్నారు. చదువు కేవలం మర్కుల కోసమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుందని సూచిస్తున్నారు. మరోవైపు కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడుతున్నారు. వారికి ప్రశ్నలడిగి సమాధానాలు రాబడుతున్నారు. ఆన్‌లైన్‌లో కూడా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ.. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు. మొత్తంగా మన్యంలో విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారు.