రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:18 AM
కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ రాజము ద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోందని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు.
గుమ్మలక్ష్మీపురం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ రాజము ద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోందని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు. బుధవారం ఇరిడిలో 11 మంది గిరిజన రైతుల కు ఆమె పట్టాదారు పాస్ పుస్తకాలను పంపి ణీ చేశారు. అనంతరం జగదీశ్వరి మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు. కార్యక్రమం లో ఏఎంసీ చైర్మన్ కళావతి, తహసీల్దార్ శేఖరం, టీడీపీ నాయకులు వెంపటాపు భారతి, బిడ్డిక పద్మ, రామకృష్ణ, అప్పల స్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే.. తోలుఖర్జ గ్రామంలో రీసర్వే పూర్తి చేసుకున్న రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వ విప్ జగదీశ్వరి పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేఖరం, తోటపల్లి దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు ఆరిక జానకి, బీజేపీ మండల కన్వీనర్ కడ్రక అప్పలస్వామి, యూనిట్ ఇన్‌చార్జి బిడ్డిక కొండలరావు, నాయకులు రామకృష్ణ, హితీష్‌కుమార్, మనోహర్, కేశవ, సుధ, ధర్మారావు, కాంతారావు పాల్గొన్నారు.