వల్లంపూడిలో టైరు బండ్ల పరుగు పోటీలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:21 AM
మండలం లోని అరిగిపాలెం, ఆతవ, సోంపురం, గుడివాడ, బొద్దాం, వల్లంపూడి, వేపాడ, నల్లబిల్లి, కుమ్మపల్లి, వావిలపాడు గ్రామాల్లో బుధవారం అమావాస్య పురస్కరించుకొని నూకాలమ్మతల్లి పండగ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అమ్మవారి ఆలయాల్లో పసుపు కుంకాలు సమర్పించుకోవడంతోపాటు చీర, సారేతో మొక్కులు తీర్చుకున్నారు.
వేపాడ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మండలం లోని అరిగిపాలెం, ఆతవ, సోంపురం, గుడివాడ, బొద్దాం, వల్లంపూడి, వేపాడ, నల్లబిల్లి, కుమ్మపల్లి, వావిలపాడు గ్రామాల్లో బుధవారం అమావాస్య పురస్కరించుకొని నూకాలమ్మతల్లి పండగ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అమ్మవారి ఆలయాల్లో పసుపు కుంకాలు సమర్పించుకోవడంతోపాటు చీర, సారేతో మొక్కులు తీర్చుకున్నారు. బొద్దాం, సోంపురం, వల్ల్లంపూడి, వేపాడ, వావిలపాడుల్లో అన్నసంతర్పణ కార్యక్రమాలు స్వీకరించారు. బొద్దాం, వావిలపాడుల్లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్‌తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వల్లంపూడిలో టైరు బండ్ల పరుగు పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. వావిలపాడులో ఉగాది పురస్కరించుకొని గురువారం ఎడ్లబండ్ల పరుగు పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లుచేశారు.