సాలూరులో తిరంగా ర్యాలీ
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:07 AM
పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు బుధవారం తిరంగా ర్యాలీని నిర్వహించారు.
సాలూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు బుధవారం తిరంగా ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సైకిల్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. దేశ సమైక్యత, అఖండత, దేశక్తి సందేశాన్ని చాటుతూ ఈ ర్యాలీ కొనసాగించారు.