ప్రమాణస్వీకారాలకు వేళాయే..
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:48 PM
Time for the Swearing-in Ceremonies జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారాలకు రంగం సిద్ధమైంది. 19, 20 తేదీల్లో ఈ ప్రక్రియ చేపట్టందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు గురువారం మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీ సభ్యులతో తొలు సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అవసరమైన చోట చేతులెత్తే పద్ధతిలో ఎంపీపీలు, వైస్ ఎంపీపీలను ఎన్నుకుంటారు. సింగిల్ నామినేషన్ పడిన చోట డైరెక్ట్‌గా ఎంపీపీల పేర్లను ప్రకటిస్తారు.
అనంతరం ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక
నోటిఫికేషన్ విడుదల
పార్వతీపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారాలకు రంగం సిద్ధమైంది. 19, 20 తేదీల్లో ఈ ప్రక్రియ చేపట్టందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు గురువారం మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీ సభ్యులతో తొలు సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అవసరమైన చోట చేతులెత్తే పద్ధతిలో ఎంపీపీలు, వైస్ ఎంపీపీలను ఎన్నుకుంటారు. సింగిల్ నామినేషన్ పడిన చోట డైరెక్ట్‌గా ఎంపీపీల పేర్లను ప్రకటిస్తారు. అనంతరం కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మన్యంలోని 15 మండలాల్లో 226 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీడీపీ అభ్యర్థులు 123 స్థానాల్లో , జనసేన 37, బీజేపీ 2, ఇతరులు 2 స్థానాల్లో విజేతలుగా నిలిచారు. వైసీపీ 62 ఎంపీటీసీ స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. మొత్తంగా నేటి నుంచి 15 మండలాల్లో ఎంపీపీల పాలన ప్రారంభమవుతుంది. ప్రత్యేకాధికారుల పాలన ముగుస్తుంది. కాగా పరోక్ష పద్ధతిలో జరిగే ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఎంపీపీలుగా ఖరారైన పేర్లు ..
పార్వతీపురం , పాచిపెంట, కొమరాడ , వీరఘట్టం, గరుగుబిల్లి, భామిని ఎంపీపీలుగా కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు బోను దేవి చంద్రమౌళి, జి.యుగంధర్ , జలుమూరు లక్ష్మణరావు, లింగాల కృష్ణవేణి , ఎం.నారాయణస్వామి, ఎం. జయమ్మ పేర్లు ఖరారయ్యాయి. మక్కువ ఎంపీపీగా వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి మావుడి రామలక్ష్మి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
విప్ జారీ..
ప్రతి మండలంలో రాజకీయ పార్టీలు బుధవారం విప్ జారీ కార్యక్రమం చేపట్టాయి . వాటిని ఎంపీడీవోలకు అందించారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికకు పూర్తిస్థాయి బలం లేనప్పుడు విప్ జారీ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఎంపీటీసీలు, మరో పార్టీ ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్యర్థులకు మద్దతు పలకకుండా విప్ ఉపయోగిస్తారు. ఎవరైనా పార్టీ విప్‌నకు వ్యతిరేకంగా ఓటింగ్ చేస్తే తన సభ్యత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే ముందస్తుగా రాజకీయ పార్టీలు విప్ జారీ చేసే ప్రక్రియను చేపట్టారు. కాగా జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ , ఎంపీపీలు, వైస్ ఎంపీపీల ఎన్నికలకు సంబంధించి జనసేన నాయకులు ఇన్‌చార్జి జేసీ వైశాలికి బుధవారం ఏ ఫారాన్ని అందించారు.
కలెక్టరేట్‌లో ఏర్పాట్లు
జిల్లాలోని 15 మండలాల్లో విజేతలుగా నిలిచిన జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్ర వారం జరగనుంది. ఈ కార్యక్రమం కలెక్టరేట్‌లో నిర్వహించున్నారు. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక అనంతరం జడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం చేపడతారు. తర్వాత వారు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జడ్పీ చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాలో తొలిసారిగా జడ్పీ పాలన ప్రారంభం కానుంది. జడ్పీ టీసీల ప్రమాణస్వీకార కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమశాఖ మం త్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ తదితరులు హాజరుకానున్నారు. కాగా 15 జడ్పీటీసీ స్థానాల్లో ఏడు టీడీపీ, మూడు జనసేన అభ్యర్థులు కైవసం చేసుకోగా.. వైసీపీ ఐదు స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే.