Checkposts చెక్‌పోస్టుల వద్ద నిఘా పటిష్ఠం
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:17 PM
Tightened Vigil at Checkposts చెక్ పోస్టుల వద్ద నిఘా పటిష్ఠం చేసి ...నిరంతర తనిఖీలు చేపట్టాలని డీఎస్పీ గోవిందరావు ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌తో కలిసి కొట్టక్కి వద్ద నిర్వహిస్తున్న చెక్‌పోస్టును పరిశీలించారు
రామభద్రపురం, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): చెక్ పోస్టుల వద్ద నిఘా పటిష్ఠం చేసి ...నిరంతర తనిఖీలు చేపట్టాలని డీఎస్పీ గోవిందరావు ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌తో కలిసి కొట్టక్కి వద్ద నిర్వహిస్తున్న చెక్‌పోస్టును పరిశీలించారు వివిధ వాహనాలు తనిఖీల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్‌స్పాట్‌ల వద్ద రేడియం స్టిక్కర్లుతో ఏర్పాటు చేసిన డ్రమ్ములు, టైర్లు ఉంచితే సత్ఫలితాలు సాధించే అవకాశం ఉందన్నారు. సైబర్ నేరాలు, మహిళల పట్ల అనుచిత ప్రవర్తనలపై నిఘా ఉంచామని చెప్పారు.
మహిళల పాత్ర అత్యంత కీలకం
బొబ్బిలి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): సమాజంలో మహిళల పాత్ర అత్యంత కీలకమైనదని బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు అన్నారు. స్థానిక ఫంక్షన్ హాలులో గురువారం మధ్యాహ్నం మహిళా సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టడానికి మహిళలంతా కొంగు బిగించాలన్నారు. యువతీ యువకులు పెడదోవ పట్టకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. పిల్లల నడవడికపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియపరచాలన్నారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కింతలి నారాయణరావు, ఐసీడీఎస్ పీఓ జె.విజయలక్ష్మి, ఎంఎస్‌పీలు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు ఇతర మహిళలు పాల్గొన్నారు.