మాదకద్రవ్యాలపై నిఘా
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:54 PM
మాదకద్రవ్యాలపై నిఘా పెంచాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
పార్వతీపురం, జూన్30(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలపై నిఘా పెంచాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సహకారంతోనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. జిల్లాలోని ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయాలన్నారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా
ఈ ఏడాది సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని కలెక్టర్ తెలిపారు. ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తు న్నారన్నారు. ప్రజలు వాటిని నింపి ఈ నెల 14 లోగా తిరిగి బీఎల్‌వోలకు అందించాలని సూచంచారు. 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తామని, ఆగస్టు 2 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత సెప్టెంబరులో ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఓటర్లు నేరుగా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.