Share News

Municipal Elections మున్సిపల్‌ ఎన్నికలకు పటిష్ఠ భద్రత

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:15 AM

Tight Security for Municipal Elections మున్సిపల్‌ ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. నవంబరు 1న ప్రశాంత వాతావరణంలో మున్సిపల్‌ పోలింగ్‌ జరిగేలా చర్యలు చేపడుతు న్నామన్నారు.

 Municipal Elections మున్సిపల్‌ ఎన్నికలకు పటిష్ఠ భద్రత
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

  • ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. నవంబరు 1న ప్రశాంత వాతావరణంలో మున్సిపల్‌ పోలింగ్‌ జరిగేలా చర్యలు చేపడుతు న్నామన్నారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 600 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా నిబంధనలను పాటించాలన్నారు. ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

పార్వతీపురంలో రన్‌ ఫర్‌ యూనిటీ

దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విశేష కృషి చేశారని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పోలీస్‌ అమరవీరుల దినోత్సవంలో భాగంగా వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లాకేంద్రంలో జెండా ఊపి రన్‌ఫర్‌ యూనిటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ కూడలి నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నిర్వ హించిన ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు పోలీస్‌ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం రన్‌లో పాల్గొన్న వారితో రా ష్ర్టీయ ఏక్తా దివాస్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్య క్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్పీలు శేషయ్య, థామస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:15 AM