Share News

పకడ్బందీగా బందోబస్తు : డీఎస్పీ

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:16 AM

పట్టణంలో ప్రతిష్టాత్మకంగా మంగళవారం జరగనున్న గొల్లపల్లి దాడితల్లి- పాతబొబ్బిలి సరేపోలమ్మ జంట సిరిమానోత్సవాలలో ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ గా బందోబస్తు నిర్వహించాలని డీఎస్పీ రాకోటి గోవిందరావు అన్నారు.

పకడ్బందీగా బందోబస్తు : డీఎస్పీ
మాట్లాడుతున్న డీఎస్పీ గోవిందరావు

బొబ్బిలి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ప్రతిష్టాత్మకంగా మంగళవారం జరగనున్న గొల్లపల్లి దాడితల్లి- పాతబొబ్బిలి సరేపోలమ్మ జంట సిరిమానోత్సవాలలో ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ గా బందోబస్తు నిర్వహించాలని డీఎస్పీ రాకోటి గోవిందరావు అన్నారు. స్థానిక గొల్లపల్లి ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం సాయంత్రం సీఐ కింతలి నారాయణ రావు ఆధ్వర్యంలో సుమారు 300 మంది సిబ్బందితో సమావేశాన్ని నిర్వహిం చారు. రెండు గ్రామాలలో సిరిమాను రథాలు ఊరేగింపు జరిగినప్పుడు, ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, రోప్‌ పార్టీల బందోబస్తు, ఆకతాయిల కట్టడి, జేబు దొంగల నియంత్రణ వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఐల ఆధ్వర్యంలో ముఖ్యమైన కూడళ్లలో ఒక్కో పాయింట్‌ దగ్గర ముగ్గురు, నలుగురేసి చొప్పున బందోబస్తు చేపట్టాలన్నారు. పట్టణంలో కొన్ని సున్నితమైన ప్రాంతాలున్నా యని, అక్కడ ఎటువంటి గొడవలు, అల్లర్లు జరగకుండా పోలీసు పికెట్‌ ఉండాలన్నారు. తెర్లాం, బలిజిపేట ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనాలను నియంత్రించాలన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:16 AM