Tight Security కౌంటింగ్, స్ర్టాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రత
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:20 AM
Tight Security at Counting Centres and Strong Rooms జిల్లాలో కౌంటింగ్, స్ర్టాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠ భ ద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు సూచించారు. బ్యాలెట్ బాక్స్‌ల భద్రత , ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
బెలగాం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కౌంటింగ్, స్ర్టాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠ భ ద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు సూచించారు. బ్యాలెట్ బాక్స్‌ల భద్రత , ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఆదివారం పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల కౌంటింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ర్టాంగ్ రూమ్‌లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల ప్రాంగణం, స్ర్టాంగ్‌రూమ్‌ల భద్రత, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు తదిరత అంశాలపై సిబ్బంది పలు సూచనలు చేశారు. స్ర్టాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పోలీస్ నిఘా కొనసాగించాలని, అనధికార వ్యక్తులను అనుమతించరాదని ఎస్పీ తెలిపారు. ప్రతి కదిలికను పర్యవేక్షించాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది ప్రవేశమార్గాల వద్ద పటిష్ఠ బారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కళాశాల ప్రాంగణం నుంచి పై అంతస్థులో ఉన్న కౌటింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పరిశీలనలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్పీ శేషయ్య, సీఐలు రమణమూర్తి, వెంకటరావు, రంగనాథం, రమణ తదితరులు పాల్గొన్నారు.