Panchayat Elections పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:05 PM
Tight Security Arrangements for Panchayat Elections జిల్లాలో రెండు విడతల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఇందుకోసం తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
బెలగాం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు విడతల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఇందుకోసం తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని సున్నిత, అత్యంత సున్నిత గ్రామాలపై దృష్టి సారించాలని తెలిపారు. బాడీవోర్న్ కెమెరాలను కచ్చితంగా వినియోగించాలన్నారు. ఎటువంటి అవాంఛీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం డ్రోన్లతో పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించా లని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలపై విస్త్రత ప్రచారం చేయాలన్నారు. సారా, గంజాయి రవాణాపై నిఘా పెట్టాలన్నారు. నేరాల దర్యాప్తులో సాంకేతికతను జోడించి పెండింగ్ కేసులను త్వరతగతిన పరిష్కరించాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు శేషయ్య, రాంబాబు, థామస్‌రెడ్డి, ఎస్బీ సీఐ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.