Share News

బక్కుపేటలో పులి కలకలం?

ABN , Publish Date - Aug 17 , 2026 | 11:44 PM

బక్కుపేట గ్రామ సమీపంలో ఓ జంతువు అడుగు జాడలు కనిపించడంతో గ్రామస్థులు, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

బక్కుపేటలో పులి కలకలం?
అడుగు జాడలను గుర్తిస్తున్న అటవీ సిబ్బంది

సీతానగరం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): బక్కుపేట గ్రామ సమీపంలో ఓ జంతువు అడుగు జాడలు కనిపించడంతో గ్రామస్థులు, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అవి పులి అడుగులంటూ ప్రచారం జరగడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం అటవీశాఖ బృందం అక్కడకు చేరుకుని పరిశీలించింది. అక్కడ కనిపించిన అడుగు జాడలు పులివి కావని, మరో జంతువువిగా గుర్తించినట్లు అటవీశాఖ అధికారి మనోజ్‌కుమార్‌ తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

Updated Date - Aug 17 , 2026 | 11:44 PM