టిడ్కో గృహాలను అందజేయాలి
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:10 AM
టిడ్కో గృహలను లబ్ధిదారులకు అందజేయాలని సీపీఎం డిమాండ్‌చేసింది. ఈ మేరకు మంగళవారం మునిసిపల్ కార్యాలయాన్ని సీపీఎం ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ 768 ఇళ్లకు గాను 90 శాతం నిర్మాణం పూర్తయినా ఏదో ఒక షాకుతో లబ్ధిదారులకు అప్పగించడం లేదని ఆరోపించారు.
పార్వతీపురంటౌన్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): టిడ్కో గృహలను లబ్ధిదారులకు అందజేయాలని సీపీఎం డిమాండ్‌చేసింది. ఈ మేరకు మంగళవారం మునిసిపల్ కార్యాలయాన్ని సీపీఎం ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ 768 ఇళ్లకు గాను 90 శాతం నిర్మాణం పూర్తయినా ఏదో ఒక షాకుతో లబ్ధిదారులకు అప్పగించడం లేదని ఆరోపించారు. ఇంతలో టీడీపీ పట్టణాధ్యక్షులు కోలామధుతోపాటు నాయకులు బార్నాల సీతారా మ్, సారికి గణేష్, జి.రవికుమార్, మంత్రి రవికుమార్ తదితరులు మునిసిపల్ కార్యాలయంలోకి వెళ్తుండగా సీపీఎం నాయకులు వారిని అడ్డుకున్నారు. లబ్ధిదారులకు న్యాయం చేయాలని సీపీఎం నాయకులు, టీడీపీ నాయకులతో వాగ్వాదాకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే లబ్ధిదారులకు న్యాయం చేస్తామని, హామీ ఇచ్చిందని, అనవ సరంగా వారిని తప్పుదోవ పట్టించవద్దని, టీడీపీ నాయకులు కోరారు. ఇంతలో కమిషనర్ పావని జోక్యం చేసుకొని జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, మిగతా వారు చెల్లించిన నగదును చెక్కు రూపంలో గాని, బ్యాంకు ఖాతాల్లో వేయడం జరుగుతుందని, హామీ ఇవ్వడంతో సీపీఎం నాయకులతోపాటు లబ్ధిదారులు శాంతించారు.