Share News

జూన్‌ నెలాఖరులోగా టిడ్కో ఇళ్ల పంపిణీ

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:06 AM

అడ్డాపుశీల వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింద ని, జూన్‌ నెలాఖరు నాటికి మౌలిక సదుపాయాలు కల్పిం చిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.

జూన్‌ నెలాఖరులోగా టిడ్కో ఇళ్ల పంపిణీ
మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయచంద్ర :

పార్వతీపురం/పార్వతీపురంటౌన్‌,మార్చి 31 (ఆంధ్రజ్యో తి): అడ్డాపుశీల వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింద ని, జూన్‌ నెలాఖరు నాటికి మౌలిక సదుపాయాలు కల్పిం చిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. టిడ్కో గృహల నగదు చెల్లింపుల్లో దళారులను నమ్మిఎవ్వరూ మోసపోవద్దని కోరారు. మంగళవారం పార్వతీపురంలో విలేకరులతో మా ట్లాడుతూ ప్రభుత్వం టిడ్కోగృహల లబ్ధిదారులకు త్వరగా లబ్ధిచేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. 2014-19 మధ్య మూడు రకాల టిడ్కో గృహలను మంజూరు చేశా రని, ఇందులో కొందరు రూ.500లు, రూ.25వేలు, రూ.50 వేలు నగదు చెల్లించారని తెలిపారు. స్థలం కేటాయింపు లో జరిగిన జాప్యం వల కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహలను పూర్తి చేయ కుండా లబ్ధిదారులు చెల్లించిన నగదును దారి మళ్లించి అన్యాయం చేసిందని ఆరోపించారు. వారి అన్యా యాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు గతంలో నగదు చెల్లించని లబ్ధిదారులకు న్యాయం చేయాలనే సంకల్పంతో రూ.2.25 కోట్లను పురపాలకసంఘ ఖాతాకు జమ చేశారని తెలిపారు. ఆ నగదును లబ్ధిదారులకు చెక్కుల రూపంలో చెల్లించాలా లేదా వారి ఖాతాల్లో జమ చేయాలా అన్న విషయంపై త్వరలో ఒక నిర్ణయం తీసు కోనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణా ధ్యక్షుడు కోలా మధు, అరకు పార్లమెంట్‌ కార్యదర్శి జి.రవి కుమార్‌, యువజన విభాగం అధ్యక్షులు పి.రాజశేఖర్‌, నాయకులు, బెలగాం జయప్రకాష్‌ నారాయణ, బార్నాల సీతారామ్‌, సారికి గణేష్‌, ఎం.రవికుమార్‌ పాల్గొన్నారు.

పులిగుమ్మిలో అమ్మవార్లకు పూజలు

పార్వతీపురం రూరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పులిగమ్మిలో సుప్పోలమ్మ, బంగారమ్మ, నూకాలమ్మ అమ్మవార్లను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మంగళవారం దర్శించుకున్నారు. ఆ గ్రామంలో అమ్మ వార్ల పండగ పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 12:06 AM