Thrilling క్షణక్షణం ఉత్కంఠ
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:00 AM
Thrilling Every Moment సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. మంగళవారం అర్ధరాత్రి వరకూ కౌంటింగ్ జరిగింది. అయినా ఫలితాలు వెల్లడి కాలేదు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మొదటి రెండు రౌండ్లలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యం చూపారు. అయితే ఆ తరువాత రెండు రౌండ్లలో జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థి గొర్లె విజయకుమారి మెజార్టీ సాధించి విజయం దక్కించుకున్నారు.
అభ్యర్థుల్లో టెన్షన్
మొదటి రెండు రౌండ్లలో వైసీపీ ఆధిక్యం
ఆ తరువాత రెండు రౌండ్లలో మెజార్టీ సాధించిన జనసేన
ఆ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా గెలుపొందిన విజయకుమారి
సాలూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. మంగళవారం అర్ధరాత్రి వరకూ కౌంటింగ్ జరిగింది. అయినా ఫలితాలు వెల్లడి కాలేదు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మొదటి రెండు రౌండ్లలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యం చూపారు. అయితే ఆ తరువాత రెండు రౌండ్లలో జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థి గొర్లె విజయకుమారి మెజార్టీ సాధించి విజయం దక్కించుకున్నారు. మొత్తంగా 41,934 ఓట్లకు సంబంధించి 27, 200 ఓట్లు పోలయ్యాయి. వాటిని అధికారులు నాలుగు రౌండ్లుగా విభజించి ఫలితాలు ప్రకటించారు. మొదటి రెండు రౌండ్లలో వైసీపీ అభ్యర్థి రిబ్కా రాణి మెజార్టీ సాధించారు. ఆ తరువాత రెండు రౌండ్లలో జనసేన అభ్యర్థి గొర్లె విజయకుమారి 296 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమెకు 9,686 ఓట్లు, వైసీపీ అభ్యర్థి భవిరెడ్డి రిబ్కా రాణికి 9,390 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి గుళ్ల మంజీరాకు 6,143 ఓట్లు వచ్చాయి. 32 వార్డుల్లో టీడీపీకి 11, బీజేపీ 1, జనసేనకు 4, వైసీపీ 13, స్వతంత్ర అభ్యర్థులు 3 వార్డుల్లో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు, అభ్యర్థుల ఫలితాల వెల్లడి ప్రక్రియ, బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు పూర్తియింది. అనంతరం విజయం సాధించిన అభ్యర్థులకు అధికారులు డిక్లరేషన్ పత్రాలు అందించారు.