ఎన్నికలకు మూడంచెల భద్రత: ఎస్పీ
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:47 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు మూ డంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు ఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు.
పాలకొండ/గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు మూ డంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు ఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు. పాలకొండ, వీరఘట్టం ఎంపీడీవో కార్యాలయాల్లోని నామినేషన్ కేంద్రాలను డీఎస్పీ ఎం.రాంబాబుతో కలిసి గురువారం ఆయన పరిశీ లించారు. జిల్లాలో 45 సమస్యాత్మక కేంద్రా లను గుర్తించామని, 800 మంది పోలీసు సిబ్బం దితో మూడంచెల భద్రతా కల్పిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద వంద మీటర్ల పరిధిలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే కేంద్రం లోపలకు అను మతి ఉంటుందన్నారు. అనవసరంగా గుమిగూడ డం, శాంతిభ ద్రతలకు విఘాతం కలిగిస్తే చర్య లు తప్పవన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రసాద రావు, ఎస్‌ఐలు షణ్ముఖరావు, వెంకన్న, శంకర రావు పాల్గొన్నారు.
24 గంటలూ నిఘా
ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వ హించేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవ హరిస్తుందని, చెక్‌పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్ష ణ ఉండాలని ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. గుమ్మలక్ష్మీపురం జంక్షన్ చెక్‌పోస్టును ఆయన గురువారం పరిశీలించారు. ఎఫ్‌ఎస్‌టీ, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలతో 24 గంటల నిఘా కొనసా గిస్తున్నట్టు ఆయన వివరించారు. చెక్‌పోస్టుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలి కలపై నిరంతరం నిఘా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు అక్రమ నగదు, మద్యం, ఇతర ప్రలో బపరిచే వస్తువుల రవాణాను అరికట్టాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో ఎల్విన్‌పేట ఎస్‌ఐ శివ ప్రసాద్, చెక్‌పోస్టు సిబ్బంది ఉన్నారు.