రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:41 PM
మండలంలోని బొద్దాం సెంటర్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, అం దులో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది.
వేపాడ, జూన్ 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొద్దాం సెంటర్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, అం దులో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్.కోట మండలం శివరామరాజుపేట కు చెందిన కోన ప్రసాదు, అక్కివరపు మహేష్‌లు మామిడికాయల కోసం ద్విచ క్రవాహనంపై కొత్తవలస వెళ్లి, తిరిగి వస్తున్నారు. అదే సమయంలో ఎస్.కోట నుంచి కొత్తవలస వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఎస్.కోట శ్రీనివాసకాలనీకి చెందిన చుక్క హరి అనే వ్యక్తి.. వీరి వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టాడు. అలాగే వెనుక నుంచి వస్తున్న వ్యాను కిందికి అతని బైకు దూసుకుపోయింది. ఈ ప్రమా దంలో కోన ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కాగా.. అక్కివరపు మహేష్‌కు కాలు విరి గిపోయింది. అలాగే చుక్క హరికి తలకు గాయమైంది. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంపై ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో హరి పరిస్థితి విషమంగా మారడంతో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించారు.