Share News

గంజాయి కేసులో ముగ్గురికి జైలు

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:08 AM

గంజాయి కేసులో వేర్వేరు ప్రాంతా లకు చెందిన ముగ్గురికి ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.50వేలు చొప్పున జరి మానా విధిస్తూ శుక్రవారం విజయనగరం ఫస్ట్‌ అడిషినల్‌ జిల్లా సెసన్స్‌, ఎన్‌ డీపీఎస్‌ ప్రత్యేక న్యాయాధికారి ఎం.మీనాదేవి తీర్పును వెలువరించారని ఎస్‌ఐ లాలం అర్జున్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

గంజాయి కేసులో ముగ్గురికి జైలు

పాచిపెంట, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): గంజాయి కేసులో వేర్వేరు ప్రాంతా లకు చెందిన ముగ్గురికి ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.50వేలు చొప్పున జరి మానా విధిస్తూ శుక్రవారం విజయనగరం ఫస్ట్‌ అడిషినల్‌ జిల్లా సెసన్స్‌, ఎన్‌ డీపీఎస్‌ ప్రత్యేక న్యాయాధికారి ఎం.మీనాదేవి తీర్పును వెలువరించారని ఎస్‌ఐ లాలం అర్జున్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడుకు చెందిన దిండిగుల్‌ జిల్లా కలియమ్మన్కోవిల్‌ గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌, అదే గ్రామానికి చెందిన శక్తి మురగన్‌, నెల్లూరు జిల్లా పెద్దరాములుపాలెం గ్రామానికి చెందిన ఎల్లంగారి సురేష్‌కు కఠిన కారాగార శిక్ష, జరిమానా వేశారన్నారు. జరిమానా చెల్లించకుంటే మూడు నెలలు సాధారణ జైలు శిక్ష న్యాయాధికారి విధించార న్నారు. 2024 ఆగస్టు 23న పాచిపెంట మండలం ఘాట్‌రోడ్డులో రొడ్డవలస జంక్షన్‌ వద్ద ఈ ముగ్గురు గంజాయితో పట్టుబడ్డారన్నారు. అప్పటి ఎస్‌ఐ నారా యణరావు వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. విచారణలో నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో వారికి న్యాయాధికారి శిక్ష ఖరారు చేశారని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 31 , 2026 | 12:08 AM