వరకట్న వేధింపు కేసులో ముగ్గురికి జైలు
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:38 AM
మండలంలోని పేరాపురం గ్రామానికి చెందిన ముగ్గురికి వరకట్న వేధింపుల కేసులో ఏడాది జైలుశిక్ష, మొత్తం రూ.51వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినట్టు మహిళా పీఎస్ ఇన్స్పెక్టర్ ఇ.నరసింహమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పూసపాటిరేగ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని పేరాపురం గ్రామానికి చెందిన ముగ్గురికి వరకట్న వేధింపుల కేసులో ఏడాది జైలుశిక్ష, మొత్తం రూ.51వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినట్టు మహిళా పీఎస్ ఇన్స్పెక్టర్ ఇ.నరసింహమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019లో మహిళా పోలీస్స్టేషన్లో కేసును నమోదు చేశారు. ఇందులో ఏ1గా నడిమిపల్లి సన్యాశిరాజుకి ఒక సంవత్సరం సాధారణ జైలుశిక్ష తోపాటు వెయ్యి రూపాయల జరిమానా, ఏ2గా నడిమిపల్లి సత్యజగన్మోహినికి, ఏ3గా అద్దాల చిట్టిసన్యాసమ్మలకు కోర్టు శిక్ష విధించినట్టు చెప్పారు.