Share News

Three Patients ఒక్కో బెడ్‌పై ముగ్గురికి చికిత్స

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:05 AM

Three Patients on a Single Bed సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకూ స్థానిక ఏరియా ఆసుపత్రికి రోగుల తాకిడి పెరు గుతోంది. కొద్ది రోజులుగా ఆసుపత్రిలో ఉన్న వంద బెడ్‌లన్నీ నిండిపోతున్నాయి. దీంతో ఇన్‌పేషంట్ల కోసం మరో పది బెడ్‌లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు.

Three Patients   ఒక్కో బెడ్‌పై ముగ్గురికి చికిత్స
ఏరియా ఆసుపత్రిలో ఒకే బెడ్‌పై చికిత్స పొందుతున్న తల్లి,బిడ్డలు

  • రోజురోజుకూ పెరుగుతున్న ఇన్‌పేషెంట్లు

  • ఏజెన్సీలో తగ్గుముఖం పట్టని జ్వరాలు

సీతంపేట, జూలై 17(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకూ స్థానిక ఏరియా ఆసుపత్రికి రోగుల తాకిడి పెరు గుతోంది. కొద్ది రోజులుగా ఆసుపత్రిలో ఉన్న వంద బెడ్‌లన్నీ నిండిపోతున్నాయి. దీంతో ఇన్‌పేషంట్ల కోసం మరో పది బెడ్‌లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు లేక ముగ్గురు రోగులు సర్దుకుని చికిత్స పొందాల్సి వస్తోంది. సీతంపేట ఆసుపత్రిలో శుక్రవారం ఓపీ 340వరకు నమోదైంది. వారిలో 53మంది ఇన్‌పేషెంట్లుగా చేరారు. ఇక 70మంది వరకు జ్వరపీడితులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. జ్వర బాధితులతో పాటు ఇతరాత్ర ఆరోగ్య సమస్యలతో వచ్చే వారితో ఏరియా ఆసుపత్రి కిక్కిరిసింది. జనరల్‌, చిన్నారులు, మహిళావార్డుల్లో రోగులు ఎక్కువ మంది ఉండడంతో బెడ్‌ లన్నీ నిండిపోయాయి. దీంతో వైద్యసేవల కోసం వచ్చే రోగులను పంపించేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాస రావును వివరణ కోరగా.. ‘రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. అయితే ఎవరికీ అసౌకర్యం కలగకుండా వైద్యసేవలు అందిస్తున్నాం. అదనంగా బెడ్‌లు కూడా ఏర్పాటు చేశాం. రోగులతో బెడ్లు నిండిపోయిన కారణంగా వైద్యసేవల కోసం వచ్చే వారిని కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నాం.’ అని తెలిపారు.

Updated Date - Jul 18 , 2026 | 12:05 AM