Emotional Bond మూడు తరాల ఆత్మీయ కలయిక
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:52 PM
Three Generations, One Emotional Bond సంక్రాంతి పండుగ సందర్భంగా రావివలసకు చెందిన మూడు తరాల కుటుంబ సభ్యులు శనివారం ఓ చోట చేరి సందడి చేశారు. పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారంతా గ్రామానికి తరలివచ్చి రోజంతా ఆనందంగా గడిపారు.
గరుగుబిల్లి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా రావివలసకు చెందిన మూడు తరాల కుటుంబ సభ్యులు శనివారం ఓ చోట చేరి సందడి చేశారు. పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారంతా గ్రామానికి తరలివచ్చి రోజంతా ఆనందంగా గడిపారు. రావివలసకు చెందిన ఆయుర్వేద వైద్యుడు రంపా వెంకటరమణమూర్తి బంధువులే వారంతా. ఆయన గ్రామంలోనే ఉండగా.. వేరే ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులను సంక్రాంతి పండుగకు ఆహ్వానించారు. దీంతో వారంతా గ్రామానికి తరలివచ్చి.. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగ వుతున్న తరుణంలో నేటి తరానికి సందేశం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశామని వెంకటరమణమూర్తి తెలిపారు. మొత్తంగా మూడు తరాలకు చెందిన వారు ఒక చోట చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు.