Three Deaths ఒకేరోజు ముగ్గురి మృతి
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:22 AM
Three Deaths in a Single Day భామిని మండలంలోని చిన్నదిమిలి గ్రామంలో శనివారం ఒకేరోజు ముగ్గురు మృతి చెందడంతో విషాదం చోటుచేసుకుంది.
చిన్నదిమిలిలో విషాదం
భామిని, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): భామిని మండలంలోని చిన్నదిమిలి గ్రామంలో శనివారం ఒకేరోజు ముగ్గురు మృతి చెందడంతో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీలాచలం కృష్ణవేణి (80) అనే వృద్ధురాలు గత 15 రోజులుగా అస్వస్థతకు గురై శనివారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఇంటి పక్కనే ఉంటున్న అదే కుటుంబానికి చెందిన బంకపట్నం సత్యనారాయణ (72) అనే వ్యక్తి శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆయన్ని కొత్తూరు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. వైద్యులు పరీక్షలు చేసి అంత బాగా ఉందనే చెప్పడంతో సత్యనారాయణ ఇంటికి చేరుకున్నాడు. అర్ధరాత్రి చాతిలో నొప్పి వచ్చి హఠాత్తుగా మృతి చెందాడు. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సీహెచ్ సింహాచలం (37) అనే వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్‌తో అక్కడ శనివారం మృతి చెందాడు. సింహాచలం మృతదేహం ఆదివారం స్వగ్రామం చేరుకుంది. ఒకే రోజు మృతి చెందిన ఈ ముగ్గురికీ గ్రామంలోని శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించారు.