Share News

చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:16 AM

దొంగతనం కేసును సాలూరు పోలీసులు ఛేదిం చారు. నిందితులు, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌
నిందితులు, చోరీ సొత్తుతో సీఐ

సాలూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): దొంగతనం కేసును సాలూరు పోలీసులు ఛేదిం చారు. నిందితులు, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం స్థానిక పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరులతో సమావేశంలో ఆ వివరాలను సాలూరు టౌన్‌ సీఐ అప్పలనాయుడు వెల్లడించారు. గుమడాం గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలో ఓ ఇంటిలో దొంగతనం జరిగిన కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న సాలూరు మండలంలోని గుమడాం, రామభద్రపురం మండలం కొండకెంగువ, విశాఖకు చెందిన ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేసి వారి నుంచి రూ.3 లక్షల విలువైన 3 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల విలువైన కేటీఎం ద్విచక్ర వాహనం, మరొక ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్లు, రూ.19 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలలో కొన్నింటిని వారు విక్రయించినట్టు గుర్తించామన్నారు. వాటిని చట్టపరమైన విధానంలో స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 12:16 AM