Share News

No Return… మరికాసేపట్లో స్వగ్రామాలకు చేరుకోవాల్సిన వారు .. తిరిగిరాని లోకాలకు...

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:14 AM

Those Who Were About to Reach Their Hometowns Soon… Ended Up in a World of No Return… ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం గుమ్మలక్ష్మీపురం మండలంలో ఈ ప్రమాదం జరిగింది.

 No Return… మరికాసేపట్లో స్వగ్రామాలకు చేరుకోవాల్సిన వారు ..  తిరిగిరాని లోకాలకు...

  • ఈ ఘటనలో ఇద్దరి మృతి .. మరో ముగ్గురికి గాయాలు

  • కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం గుమ్మలక్ష్మీపురం మండలంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బొడ్లగూడకు చెందిన కొండగొర్రె మధు (25), కార్తిక్‌ బంధువులు. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కాగా ఒక పనిపై బైక్‌పై రేగిడికి వెళ్లి.. అక్కడి నుంచి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మరోవైపు రేగిడికి చెందిన ఊలక గణేష్‌ (26), సింహాచలం, త్రినాథ్‌ కురుపాంలో పనిచేసుకుని బైక్‌పై స్వగ్రామానికి పయనమయ్యారు. వ్యవసాయ కూలీలైన వారు ముగ్గురు కూడా బంధువులే. కాగా ఎదురెరుదుగా వస్తున్న ఆ రెండు ద్విచక్ర వాహ నాలు బెల్లిడి సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌లపై ఉన్నవారంతా రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయారు. బెల్లిడి వాసులు హుటాహటిన అక్కడకు చేరుకుని క్షత గాత్రులకు సపర్యలు చేశారు. అయితే అప్పటికే మధు చనిపోయినట్లు గుర్తించారు. మిగతా వారిని ఆటో సాయంతో రేగిడి పీహెచ్‌సీకి తరలించారు. కార్తీక్‌, సింహాచలం, త్రినాథ్‌లు అక్కడే చికిత్స పొందగా.. గణేష్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కురుపాం సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ గణేష్‌ మృతిచెందాడు. ఆయనకు భార్య, బాబు ఉన్నారు. మధుకు వివాహం కాలేదు. నలుగురు అన్న దమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. కాగా ఈ రోడ్డు ప్రమాదంలో తమ వారిని పోగొట్టుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మరికాసేపట్లో స్వగ్రామాలకు చేరుకోవాల్సిన వారు .. ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపో వడంతో ఆయా గ్రామాల్లో విషాద చాయలు అలుమకున్నాయి.ఈ విషయం తెలుసుకున్న ఎల్విన్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఘటనపై ఆరా తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరి తెలిపారు.

Updated Date - Apr 29 , 2026 | 12:14 AM