పదవులు దక్కని వారు నిరాశచెందొద్దు
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:49 AM
కూటమి ధర్మంలో భాగంగా తప్పనిసరి పరిస్థితు ల్లో పదవులు దక్కని వారు నిరాశ చెందకూడదని, తమ ఆలోచనల వల్ల గ్రామాలకు మేలు జరుగు తుందన్న విషయాన్ని గుర్తించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపా రు.
ఏకగ్రీవాలతో అన్నిపార్టీల నాయకులు ప్రయత్నించాలి
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున
చీపురుపల్లి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కూటమి ధర్మంలో భాగంగా తప్పనిసరి పరిస్థితు ల్లో పదవులు దక్కని వారు నిరాశ చెందకూడదని, తమ ఆలోచనల వల్ల గ్రామాలకు మేలు జరుగు తుందన్న విషయాన్ని గుర్తించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపా రు. పంచాయతీ పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాలకు మేలు జరుగుతుందని చెప్పారు. బుధవారం చీపురుపల్లిలో ఆయన విలేక రులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లు ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈవిషాయాన్ని టీడీపీ నాయకులు గమనించాలని కోరారు. రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రామా భివృద్ధి, సమాజాభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా ఆలోచించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న సుపరిపాలనకు ప్రజలు తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నారన్న విషయం మునిసిపల్ ఎన్నికల్లో బహిర్గతమయ్యిందని చెప్పారు. పంచాయతీల్లో కూడా అదే రకమైన ఫలితాలు ఉంటాయని నాగార్జున ధీమా వ్యక్తంచేశారు. అయినా అవకాశం ఉన్నచోట ఏకగ్రీ వాలకు అన్ని పార్టీల నాయకులు ప్రయత్నం చేయాలని కోరారు.