దళితులపై దాడులు చేసిన వారిని శిక్షించాలి
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:53 PM
జిల్లాలోని భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో దళితులపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేసి, శిక్షించాలని ముంజేరు దళితుల ఆత్మగౌరవ కమిటీ సభ్యులు గంట్లాన అప్పారావు, వీవీ దుర్గారావులు డిమాండ్ చేశారు.
విజయనగరం దాసన్నపేట, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో దళితులపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేసి, శిక్షించాలని ముంజేరు దళితుల ఆత్మగౌరవ కమిటీ సభ్యులు గంట్లాన అప్పారావు, వీవీ దుర్గారావులు డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరంలోని ప్రెస్‌క్లబ్‌లో బాధితులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామంలోని మురికినీరంతా తమ కాలనీ వైపు మళ్లించడం అన్యాయమని సిద్ధార్థ కాలనీ దళితులు గత ఏడేళ్లుగా పోరాడుతున్నారన్నారు. గత ఏడాది నవంబరు 20న స్థానిక రాజకీయ నేతలు ఒక్కటై కాలనీ వైపు కాలువ నిర్మించేందుకు రాగా, అడ్డుకున్న దళిత మహిళలను కొట్టి, కులం పేరుతో దూషించి దౌర్జన్యంగా కాలువలు నిర్మించారని తెలిపారు. దీనిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పట్టించుకోకుండా, కేసులు తప్పుదోవ పట్టించడం దారుణమన్నారు. సభ్యులు పీవీ రమణ, ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.