ఇది భక్తుల నమ్మకంపై దాడి
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:04 AM
తిరు మల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వినియోగం.. భక్తుల నమ్మకంపై జరిగిన దాడని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.
శృంగవరపుకోట, జనవరి 29(ఆంధ్రజ్యోతి): తిరు మల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వినియోగం.. భక్తుల నమ్మకంపై జరిగిన దాడని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. గురువారం స్థానిక దుర్గా దేవి ఆలయంలో దేవాలయ శుద్ధికరణ పూజలు నిర్వ హించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ హయాంలో తిరుమల వేంకటేశ్వర ఆలయంలో ఉద్దేశ పూర్వకంగా కల్తీ నెయ్యి వినియోగించారని అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు డోకుల అచ్చంనాయుడు, ప్రధాన కార్యదర్శి కోట్యాడ జగదీష్, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, నాయకులు నానిగిరి రమణాజీ, వాకాడ బాలు, చక్కా కిరణ్, కాపుగంటి వాసు, పెదగాడ రాజు, సాయిరాం, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుతోనే రైతులకు న్యాయం
లక్కవరపుకోట, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, ఇప్పుడున్న ఏపీలోనూ రైతులను పట్టించుకున్న నాయకునిగా చంద్రబాబుకే గౌరవం దక్కుతుందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. గురువారం ఆమె మండల పరిషత్ కార్యాల యంలో ఎంపీడీవో ఎస్.అప్పారావు అధ్యక్షతన జరిగిన గోకులం షెడ్ల బిల్లుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅ తిథిగా పాల్గొన్నారు. 2014-19 మధ్య కాలంలో పశువుల షెడ్లు నిర్మించుకుని బిల్లులు పెండింగ్ ఉన్న రైతులకు మంజూరై చెక్కులను ఆమె అందజేశారు. మండలంలో 436 షెడ్లు మంజూరు కాగా, అందులో 61 మంది రైతు లకు సుమారు రూ.12 లక్షలు పెండింగ్ బిల్లులు చెక్కు ల రూపంలో అందజేశారు. మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునా యుడు, డైరెక్టర్ కళ్లద్దాల శ్రీను, సర్పంచ్ భూపాల్‌నా యుడు, ఏపీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.