Share News

ఇది పనిచేసే ప్రభుత్వం

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:48 PM

రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే లలిత కుమారి అన్నారు. మంగళవారం ఆమె కల్లేపల్లిలో నూతనంగా మంజూరైన పీహెచ్‌సీ భవనానికి భూమి పూజ చేశారు.

ఇది పనిచేసే ప్రభుత్వం
నూతన పీహెచ్‌సీ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే లలితకుమారి

- ఎమ్మెల్యే లలితకుమారి

లక్కవరపుకోట, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే లలిత కుమారి అన్నారు. మంగళవారం ఆమె కల్లేపల్లిలో నూతనంగా మంజూరైన పీహెచ్‌సీ భవనానికి భూమి పూజ చేశారు. సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన ఆసుపత్రితో గ్రామీణ ప్రాం తాల్లో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని అన్నా రు. ఈ పీహెచ్‌సీ మంజూరు కోసం 2014-19 మధ్య బీజం వేశామని, ఇన్నాళ్లకు ప్రజల కల నెరవేరిందని తెలిపారు. ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేశారన్నారు. సంజీవని పథకంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్య ముఖ చిత్రంమారనుందని ఎమ్మె ల్యే తెలిపారు. నూతన పీహెచ్‌సీ భవనం మంజూరు కోసం నిరంతరం కష్టపడిన స్థానిక పీహెచ్‌సీ వైద్యులు అజయ్‌, అనిల్‌ను ఎమ్మెల్యే ప్రశంసించారు. కార్యక్రమంలో నాయకులు చొక్కాకుల మల్లునాయుడు, జక్కాన కన్నబాబు, సింహాద్రప్పడు, మెడికల్‌ అధికారులు, అజయ్‌కుమార్‌, అనీల్‌కుమార్‌, ఏపీఎంఐడీసీ ఈఈ భారతి, డీఈ కుమార్‌, టీఏ హరి, పంచాయతీ కార్యదర్శి లీలా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:48 PM