Share News

ఇది రైతు ప్రభుత్వం

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:13 AM

రాష్ట్రంలో ఉన్నది బొమ్మల ప్రభుత్వం కాదని, రైతులు మేలుకోరే ప్రభుత్వమని ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి అన్నా రు.

ఇది రైతు ప్రభుత్వం

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి

లక్కవరపుకోట, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్నది బొమ్మల ప్రభుత్వం కాదని, రైతులు మేలుకోరే ప్రభుత్వమని ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి అన్నా రు. గురువారం ఆర్జీపేట గ్రామంలో రైతులకు ఆమె పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈసంద ర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సర్వే రాళ్లపైన, పట్టాదారు పాసుపుస్తకాలపైన, ఆర్‌వోఆర్‌ 1బీలపైన జగన్‌ బొమ్మలు ఉండేవని గుర్తు చేశారు. అనంతరం 380 మంది రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు కరెడ్ల ఈశ్వరరావు, తహసీల్దార్‌ హరి, ఏఎంసీ చైర్మన్‌ చొక్కాకుల మల్లునాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులో చౌక బియ్యం

లక్కవరపుకోట, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ప్రజలకు నాణ్యమైన బీపీటీ బియ్యాన్ని ప్రభుత్వం అందుబాటు లోకి తీసుకొచ్చింది. రంగరాయపురంలో సోమయాజులు రైస్‌మిల్లు వద్ద ఏర్పాటుచేసిన అవుట్‌లెట్‌ పాయింట్‌ను ఎమ్మెల్యే లలితకుమారి గురువారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రైసుమిల్లర్ల అసోషియేషన్‌ సౌజన్యంతో బియ్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా బీపీటీ స్టీమ్డ్‌ బియ్యం కిలో రూ.52లకు, పచ్చి బియ్యం రూ.50లకు లభించనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 రైతు బజారుల్లో, 500 రైసుమిల్లు పాయింట్ల వద్ద ఈ స్టాల్స్‌ను ఏర్పాటు చేసి నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, చొక్కాకుల మల్లునాయు డు, తహసీల్దార్‌ హరి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం వెనుకబాటుకు వైసీపీయే కారణం..

వేపాడ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం అన్ని రంగా ల్లో వెనుకబడేందుకు గత వైసీపీ ప్రభుత్వమే కారణ మని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా వావిలపా డు గ్రామ శివారు సంజీవమెట్ట గ్రామంలో ఆమె గురు వారం పర్యటించి, ప్రభుత్వ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు గోగాడ జగన్నాథం నాయుడు, గుంటపల్లి దేముడునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షు డు గొంప వెంకటరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్యా డ రమణమూర్తి, ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ, మహిళా నేత గుమ్మడి భారతి పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 12:13 AM